ఝార్ఖండ్‌ పీసీసీ చీఫ్‌ రాజీనామా

మా పార్టీ నేతల కంటే నేరగాళ్లే నయం

Ajoy Kumar
Ajoy Kumar

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ జార్ఖండ్ చీఫ్ అజోయ్ కుమార్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు నేతలు తీవ్ర అవినీతికి పాల్పడుతున్నారని, స్వప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. వారికంటే కరడుగట్టిన నేరస్తులు చాలా నయమన్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీకి మూడు పేజీల రాజీనామా లేఖను పంపారు.
అయితే తాను రాజీనామా చేయడానికి కేంద్ర మాజీ మంత్రి సుబోధ్ కాంత్ సహాయ్, రామేశ్వర్ ఒరయాన్, మాజీ ఎంపీలు చంద్రశేఖర్ దూబే, ఫర్ఖాన్ అన్సారీ, పీసీసీ మాజీ చీఫ్ ప్రదీప్ బాల్‌ముచ్చు వంటి నేతలే కారణమని అజోయ్ కుమార్ ఆరోపించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వీరంతా పదవులు అనుభవిస్తున్నారని అన్నారు. అవినీతిని తాను అస్సలు సహించబోనని, అది ఏ రూపంలో ఉన్నా తాను అడ్డుకుంటానని అన్నారు. ఇది తన పదవికి అడ్డంకిగా మారిందని, కాబట్టి దయచేసి తన రాజీనామాను ఆమోదించాలని ఆ లేఖలో కోరారు.



తాజా ఆద్యాత్మికం వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/