లాలూకు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు
జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు

ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దుమ్కా ట్రెజరీ నుంచి అక్రమంగా నిధులను మళ్లించిన కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చింది. పశువుల దాణా కుంభకోణం సంబంధించి నాలుగు కేసుల్లో లాలూకు శిక్ష ఖరారైంది. ఇందులో మూడిటికి ఇప్పటికే బెయిల్ లభించింది. తాజా బెయిల్‌తో. ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/