జార్ఖండ్‌లో తొలి దశ పోలింగ్‌ ప్రారంభం

తొలి దశలో 13 నియోజకవర్గాల్లో పోలింగ్

polling
polling

రాంచీ: ఈరోజు ఉదయం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ను మధ్యాహ్నం మూడు గంటలకే ముగించనున్నారు. మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఐదు దశల్లో పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 23న ఫలితాలు వెలువడనున్నాయి. అధికార పార్టీ అయిన బిజెపి తొలి దశలో 12 స్థానాల్లో పోటీకి దిగింది. ఒక చోట ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. ప్రతిపక్షాలైన కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తిమోర్చా, ఆర్జేడీలు కూటమిగా ఏర్పడి బిజెపి కి సవాలు విసురుతున్నాయి. తొలి దశలో కాంగ్రెస్ జార్ఖండ్ చీఫ్ రామేశ్వర్, ఆరోగ్యశాఖ మంత్రి రామచంద్ర చంద్రవంశీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆరు జిల్లాల్లోని మొత్తం 13 నియోజకవర్గాల్లో తొలి దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 37,83,055 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 18,01,356 మంది కాగా, ఐదుగురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. తొలి దశలో మొత్తం 189 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, వీరిలో 15 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/