తాత్కాలికంగా జెట్‌ విమానాలన్నీ రద్దు!

Jet Airways
Jet Airways

హైదరాబాద్‌: జెట్‌ ఎయిర్‌వేస్‌ దాదాపు 8 వేల కోట్ల అప్పుల ఊబిలో ఉన్నది. అయితే ఆ సంస్థ‌కు చెందిన విమానాలు అన్నీ తాత్కాలికంగా ర‌ద్దు అయిన‌ట్లు తెలుస్తోంది. ఈరోజు ముంబైలో జెట్ సంస్థ బోర్డ్ మీటింగ్ జ‌రుగుతున్న‌ది. జెట్‌ను ఆదుకునే ప్ర‌య‌త్నాలు విమాన‌యాన‌శాఖ చేసినా ఫ‌లితం లేకుండాపోయింది. ఆ సంస్థ‌కు ఎమ‌రెన్సీ నిధులు ఇచ్చేందుకు ఎవ‌రూ ముందుకు రాలేదు. ప్ర‌స్తుతం ఆ కంపెనీకి చెందిన ప‌ది విమానాలు మాత్ర‌మే సేవ‌లు అందిస్తున్నాయి. ఇక నుంచి అవి కూడా ఎగ‌ర‌వ‌ని తెలుస్తోంది.


మరిన్ని తాజా బిజెనెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/