జెట్‌ ఎయిర్‌వేస్‌కు రుణదాతలు!

Jet Airways
Jet Airways

ముంబయి: అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ ఏప్రిల్ 17న తన కార్యకలాపాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఆర్థిక సాయం చేసేందుకు రుణదాతలు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఎంత మొత్తంలో రుణం ఇవ్వనున్నారో మాత్రం కచ్చితంగా తెలియరాలేదు. కానీ 10మిలియన్‌ డాలర్లు రుణంగా ఇచ్చేందుకు రుణదాతలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం వల్ల సంస్థ పగ్గాలు అప్పులిచ్చిన ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం చేతుల్లోకి వెళ్లాయి. ఉద్యోగులకు సైతం జీతాలిచ్చుకోలేని పరిస్థితికి చేరిన జెట్‌ ఎయిర్‌వేస్‌..ఈ రుణంతో కొంత మేర బయట పడనుంది. ఈ సంస్థ తన కార్యకలాపాలను యథావిధిగా నిర్వహించాలంటే కనీసం రూ.400 కోట్లు అవసరం.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/