అడ్వాన్సు బుకింగ్స్‌ నిలిపేయండి..!

ముంబయి : జెట్‌ఎయిర్‌వేస్‌ను అడ్వాన్సు బుకింగ్స్‌ చేయవద్దని సివిల్‌ఏవియేషన్‌ డైరెక్టరేట్‌ జనరల్‌ కార్యాలయం ఆదేశాలు జారీచేయడంతో సీట్ల కెపాసీటీని సైతం భారీగా తగ్గించింది. దీనికితోడు భారీ ఎత్తున బుక్‌ అయిన టికెట్లుసైతం రద్దయ్యాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ మొత్తం 116 విమానాల్లో 61 విమానాలు మాత్రమే నడుస్తున్నాయి. సుమారు 45శాతానికిపైగా మొత్తం విమానాలు రద్దయ్యాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ సుమారు 600 సర్వీసులను భారత్‌, విదేశీ రూట్లలో నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఉన్న సమస్యల కారణంగా ఇకపై అడ్వాన్సు బుకింగ్‌లు చేయవద్దని కోరతామని డిజిసిఎ అధికారులు వెల్లడించారు. ఎయిర్‌వేస్‌ తన వెబ్‌సైట్‌పై 1165 రూపాయల టికెట్లతో మొత్తం 37 దేశీయ గమ్యస్థానాలకు పంపించేందుకు టికెట్లు ఆఫర్లు ఇచ్చింది. ఏడాదికాలంలోపు ఎప్పుడైనా ప్రయాణించేవిధంగా టికెట్ల ధరలను ప్రకటించింది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఇదేవిషయమై తీవ్రంగా పరిగణించింది. బడ్జెట్‌ క్యారియర్‌ స్పైస్‌జెట్‌ 2014లో మూసివేతకు దగ్గరపడుతున్న సమయంలో ఇలా ఆఫర్లు ఇవ్వడాన్ని సైతం తీవ్రంగా పరిగణించి హెచ్చరికలుచేసింది. అదేవిధంగా ఇపుడు కూడా హెచ్చరికలు చేయడంతో ఇపుడు జెట్‌ ఎయిర్‌వేస్‌సైతం బుకింగ్స్‌ నిలిపివేయాల్సి వస్తోంది. డిజిసిఎ ఈలోపు నగదు సమస్యతో సతమతం అవుతున జెట్‌పై సమీక్ష చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రతి పక్షంరోజులకు ఒకపర్యాయం సంస్థ సర్వీసులను సమీక్షిస్తున్నట్లువెల్లడించింది. నరేష్‌ గోయల్‌ ఆధ్వర్యంలోని జెట్‌ ఎయిర్‌వేస్‌ ఇప్పటికే వివిధ మార్గాల్లో నిధులు సమీకరించేందుకు నిర్ణయించింది. భారీ సంఖ్యలో విమానాలు నిలిపివేయడంతోను కొన్ని స్టేషన్లను మూసివేయాల్సి వచ్చింది. సిబ్బంది జీతభత్యాల చెల్లింపులు సైతం జాప్యం కావడం, ఇంజనీర్లు, ఇతర సీనియర్‌ ఉద్యోగులకు చెల్లింపుల్లో బకాయిపడటంతో ఇటీవలికాలంలో వార్తల్లోకెక్కింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ ఛైర్మన్‌నరేష్‌ గోయల్‌ ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌గ్రూప్‌ సిఇఒ టోని డగ్లస్‌కు లేఖరాస్తూ రూ.750 కోట్లు అత్యవసర నిధులు సమకూర్చాలని, వివిధ విభాగాల్లో జరిగిన ఎంఒయులను భర్తీచేసేందుకు నిధులు అవసరం అవుతాయని వెల్లడించిన సంగతి తెలిసిందే. 50కి పైగా విమానాలు నిలిచిపోయిన ప్రస్తుత తరుణంలో జెట్‌ఎయిర్‌వేస్‌ తీవ్ర దుర్భిక్షపరిస్థితులను ఎదుర్కొంటున్నది. అందుకోసమే చివరినిమిషం వరకూ నరేష్‌గోయల్‌ తనశక్తివంచనలేకుండా నిధుల సమీకరణకు యత్నిస్తూనే ఉన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం బిజినేస్‌ క్లిక్‌ చేయండి 
https://www.vaartha.com/news/business/