గర్విస్తే పతనం తప్పదు

Jesus
Jesus

‘నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును (సామె 16:18). నేడు మానవ్ఞడి పతనానికి మూలకారణం గర్వం.

నెబుకద్నెజరు గర్వించడం వల్ల క్షణకాలంలోనే అతని రాజ్యం తొలగిపోయింది.

అంతమాత్రమే కాదు అతడు పశువ్ఞలాగా గడ్డి మేసేవాడిగా దేవ్ఞడు మార్చాడు.

దీంతో ప్రజలు అతడిని తరిమివేసారు. తన మహాపట్టణాన్ని చూసుకున్న నెబుకద్నెజరు ‘నా బలాధికారమును నా ప్రభావఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాననుకొనెను (దాని 4:30) ఇలా మనసులో అతిశయించిన వెంటనే తాను కట్టించుకున్న విశాలపట్టణంలో నివసించకుండా తరిమివేయబడ్డాడు.

హామాను మొర్దెకై తనకు నమస్కరించడం లేదని గర్వించి, అతడిని మాత్రమే కాకుండా మొత్తం యూదాజాతినే నశింపచేయాలనుకున్నాడు.

చివరికి అతని గర్వం, మోసం వల్ల అతడు, అతని కుమారులు హతమార్చబడ్డారు. గర్వం మానవ్ఞడిని పతనం వైపుకు తీసుకెళ్తుంది.

యేసుప్రభువ్ఞ దేవ్ఞడై వ్ఞండికూడా తండ్రికి లోబడి, విధేయతతో జీవించాడు. మనం కూడా యేసుప్రభువ్ఞను ఆదర్శంగా తీసుకోవాలి.

కొందరికి ప్రార్థనావరం, మరికొందరికి స్వస్థతవరం, ఇంకొందరికి వాక్యాన్ని అద్భుతంగా ప్రకటించేవరం దేవ్ఞడు అనుగ్రహిస్తాడు.

అనుగ్రహించిన దేవ్ఞడికే మహిమకరంగా ఆ వరాలను వాడాలే తప్ప, తనకు ఖ్యాతి తెచ్చుకునేందుకు వినియోగించకూడదు.

బ్రదర్‌ భక్తసింగ్‌గారు తన పరిచర్య ఆరంభదినాల్లో దేవ్ఞడు ఆయనకు స్వస్థతావరాన్ని ఇచ్చాడు. అయితే ఆ వరం వల్ల తాను దేవ్ఞడి మహిమను దొంగలిస్తున్నానని భావించి, ప్రభువా! ఈ వరం నాకు వద్దు, వెనక్కి తీసుకోమని వేడుకున్నాడు.

ఆయన జీవించిన కాలమంతా దేవ్ఞడి మహిమకరంగా ప్రవర్తించాడు. ఎంతో తగ్గింపుతో పరిచర్యను చేశాడు. అందుకే దేవ్ఞడు ఆ దైవజనుడిని అధికంగా హెచ్చించి వాడుకున్నాడు. దేవ్ఞడు అహంకారులను ఎదిరించి, దీనులకు కృప అనుగ్రహిస్తానని చెప్పాడు.

దేవ్ఞడు ఈ మాటను యాకోబు 4:6,1 పేతురు 5:5లో హెచ్చరిస్తున్నాడు. రెండుసార్లు హెచ్చరిస్తున్నాడు అంటే ఇదెంతో ప్రాముఖ్యమైన విషయం.

కాబట్టి మనం అతిశయించేందుకు, గర్వించేందుకు ఎలాంటి కారణం లేదు. మనకు ఏదైతే ఉందో అది కేవలం దేవ్ఞడి కృప. రక్షణ, మారుమనసు, పాపక్షమాపణ ఇవన్నీ దేవ్ఞడి అనుగ్రహంతో మనం పొందామే తప్ప మనకై మనం స్వతహాగా మార్పు రాలేదు.

ఆ దేవాదిదేవ్ఞడి కృపను బట్టి జీవిస్తున్న మనం ఇతరులు కూడా ఆ కృపను పొందేందుకు మనవంతు సువార్త పరిచర్యను చేద్దాం. దేవ్ఞడికి మహిమకరంగా జీవించడమే మనకున్న గొప్ప ధన్యత.

  • పి.వాణీపుష్ప

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/