సాత్విక మనసుతో వేడుకోవాలి

JESUS
JESUS

సాత్విక మనసుతో వేడుకోవాలి

‘యెహోవా- ఎన్నాళ్లవరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్లవరకు నేను వారి మధ్యను చేసిన సూచన క్రియలన్నిటిని చి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులుచేత వారిని హతముచేసి, యీ జనముకంటె మహాబలముగల గొప్ప జనమును నీవలన పుట్టించెదనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో ఇట్లనెను అలాగైతే ఐగుప్తీయులు దానిగూర్చి విందురు, నీవ్ఞ నీ బలముచేత ఈ జనమును ఐగుప్తీయులలో నుండి రప్పింపచితివిగదా, వీరు ఈ దేశనివాసులతో ఈ సంగతి చెప్పియుందురు.. ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తిలేక యెహోవా వారిని అరణ్యములో సంహరించెనని చెప్పుకొందురు.

నీ కృపాతిశయమునుబట్టి ఈ ప్రజలదోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా యెహోవా నీ మాటచొప్పున నేను క్షమించియున్నాను (సంఖ్యా 14:11-20). ఈ వాక్యాలను గమనిస్తే ఒక మానవ్ఞడు ప్రజలపై దేవ్ఞడి కోపం ద్వారా వచ్చే శిక్షనుంచి తప్పించిన విధానం.

ఇజ్రాయేలీయులు దేవ్ఞడికి విరోధంగా పాపం చేసినప్పుడు దేవ్ఞడు వారి దోషం బట్టి వారిని హతమార్చాలని చూసాడు. ఆయన కోపం ఈ ప్రజలపై పెరిగినప్పుడు ఒక సామాన్యమానవ్ఞడైన మోషే దేవ్ఞడి సన్నిధిలో ‘నీవ్ఞ ఆవిధంగా ఈ ప్రజలను హతమారిస్తే, ఐగుప్తులోని ప్రజల నీగురించి ఏమనుకుంటారు?

నీకు శక్తిలేదని అనుకుంటారుకదా? దయచేసి ఈ కీడు నుంచి నీ ప్రజలను రక్షించుము అని వేడుకున్నప్పుడు దేవ్ఞడు మోషే మాటల్ని బట్టి ప్రజలపై తన కోపాన్ని చూపలేదు. మోషే ఎంత దయగల హృదయమో దీన్నిబట్టి అర్ధం చేసు కోవచ్చు. దాదాపు 40 సంవత్సరాలు మోషే ఇజ్రాయేలీయుల ప్రజలను ఐగుప్తు నుంచి కనాను దేశానికి నడిపే నాయకుడిగా ఉన్నాడు. ఎన్నోసార్లు వీరు మోషేపై గొణిగారు, సణుగుకున్నారు. తిరుగుబాటు చేసారు. ఆయనను విసిగించారు, అవమానపరిచారు.

ఇంతచేస్తున్నా మోషే ఈ ప్రజలపై ఏమాత్రం కోపాన్ని ప్రదర్శించలేదు. దేవ్ఞడి కోపాన్ని కూడా ప్రజలపై పడకుండా తన దీనప్రార్ధనతో దేవ్ఞడిని బ్రతిమిలాడుకుంటూ, ప్రజలను శిక్ష నుంచి, మరణం నుంచి తప్పిస్తూ వచ్చాడు. మనం కూడా మన కుటుంబసభ్యులుకానీ సంఘస్తులుకానీ పొరపాట్లు చేసినప్పుడు మోషేవంటి సాత్వికమైన మనసుతో దేవ్ఞడిని బ్రతిమిలాడుకోవాలి. వారి దోషాన్ని క్షమించమని వారినిమిత్తం దేవ్ఞడికి విన్నవించాలి. అంతేతప్ప నన్ను గాయపరిచారు, ఇబ్బంది పెట్టారు అని పగతో వారిని శిక్షించమని ప్రార్ధన చేయకూడదు.

వారిని మనం మనస్ఫూర్తిగా క్షమించినప్పుడు అంతేస్థాయిలో దేవ్ఞడిని కూడా క్షమించమని వేడుకుంటాం. కాబట్టి మోషేవంటి సాత్వికమైన మనసుతో దేవ్ఞడి వద్దకు వెళ్తాం. ఎవరిపై ఎలాంటి ఫిర్యాదులు వద్దు. సమస్తం చూస్తున్న దేవ్ఞడికే వదలిపెడదాం. పగతీర్చుకోవడం నాపని అన్న దేవ్ఞడికే ప్రార్ధన చేద్దాం. శిక్షించమని కాదు, క్షమించి, వారిని రక్షించమని, వారికీ పరలోక ధన్యతను ప్రసాదించమని వేడుకుందాం.

-పి.వాణీపుష్ప