భయాలను పోగొట్టే ప్రార్థన

JESUS-
JESUS-

భయాలను పోగొట్టే ప్రార్థన

ఆ దేశములో నేను విూకు క్షేమము కలుగజేసెదను. విూరు పండుకొనునప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టడు, ఆ దేశములో దుష్టమృగములు లేకుండ చ సెదను, విూ దేశములోనికి ఖడ్గమురాదు (లేవీ 26:6,7). భయాలు మనల్ని వెంటాడుతున్నపుడు ఇలాంటి వాక్యం మనకు ఎంతో ధైర్యాన్నిస్తాయి. నిజమే మనల్ని అనేక భయాలు వెంటాడుతుంటాయి. శత్రువ్ఞల నుంచి, అపవాది నుంచి, కుటుంబ సభ్యుల నుంచి, బయటివారి నుంచి ఇలా ఎవరి ద్వారానైనా భయాలు వస్తుంటాయి. ప్రత్యేకంగా దేవ్ఞడిని వెంబడించేవారికి ఆపదలు, ప్రమాదాలు మరెక్కువగా ఉంటాయి. దేవ్ఞడు మనకు సాయం చేస్తాడనే భరోసా ఉన్నప్పటికీ పరిస్థితులను బట్టి భయం అనేది మనసులో వెంటాడుతూనే ఉంటుంది. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? జెస్ట్‌ ప్రెయర్‌..అవ్ఞను ప్రార్ధన చేస్తే చాలు. దేవ్ఞడే మనపక్షాన పోరాడి, విజయాన్నిస్తాడు. యెహోషాపాతు మీదికి మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులలో కొందరు దండిత్తి వస్తున్నారు. ఈ సమాచారం యెహోషాపాతుకు తెలుస్తుంది. ‘యెహోషాపాతు భయపడి యెహోవాయొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని, యూదాయంతట ఉపవాసదినము ఆచరింపవలెనని చాటింపగా (2 దిన 20: 1-3), ‘మా దేవా, నీవ్ఞ వారికి తీర్పుతీర్చవా? మా విూదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను (2 దిన 20:12). ఒక రాజు దేవ్ఞడి సన్నిధిలో ఇంతగా తగ్గించుకుని ప్రార్ధన చేసాడు. దీంతో దేవ్ఞడే వీరి పక్షాన యుద్ధం చేసి, విజయాన్ని ఇచ్చాడు. యెహోషాపాతు తన సైన్యాన్ని నమ్ముకోలేదు. తన బలంపై కూడా ఆధారపడలేదు. దేవ్ఞడి బలం, శక్తిపై విశ్వాసం ఉంచాడు. పూర్వం ఇశ్రాయేలీయులకు దేవ్ఞడు చేసిన విషయాలను తెలుసుకున్నాడు. ఆనాడు ఉన్నదేవ్ఞడు నేడు కూడా ఒకేరీతిగా ఉన్నాడనే విశ్వాసం యెహోషాపాతుకు ఉంది. అదే విశ్వాసంతో ఉపవాసంతో దేవ్ఞడి సన్నిధిలో ప్రార్థన చేసాడు. తద్వారా విజయాన్ని పొందాడు. మనం కూడా ఎలాంటి భయాలు, పోరాటాలు ఎదురౌతున్నా దేవ్ఞడి సన్నిధిలో ప్రార్ధన చేస్తే చాలు, ఆయనే మన పక్షాన పోరాడి, విజయాన్ని ఇస్తాడు. కాబట్టి భయాలు మనల్ని వెంటాడుతున్నప్పుడు మనం దేవ్ఞడివైపు తిరిగి, ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ, ఆయనపై విశ్వాసంతో, ప్రార్థన అనే ఆయుధంతో ముందుకు సాగిపోదాం. దేవ్ఞడు అట్టి కృపను అనుగ్రహించునుగాక..

– పి.వాణీపుష్ప