సువార్త భారం ఉండాలి

JESUS-1
JESUS

సువార్త భారం ఉండాలి

‘ఇంక నాలుగు నెలలైన తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు గదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి. అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పుచున్నాను (యోహాను 4:35). మనందరికీ డైనోసర్లు తెలిసినవే. శాస్త్రవేత్తలు ఎందువల్ల ఇవి అంతరించిపోయాయి అని పరిశోధించారు. ఈ పరిశోధన వల్ల తేలిన విషయం ఏమిటంటే డైనోసారులు శాఖాహారులు. వాటి కంటికి కనిపించే ఆకులను అవి తినేవి. అవి కొద్దిగా మెడవంచి కింద ఉన్న ఆహారాన్ని కూడా చూడగలిగితే మరికొంతకాలం జీవించి వ్ఞండేవి. అయితే వాటి మెడలు కిందకు వంగవ్ఞ. కాబట్టి నేలపై ఉన్న గడ్డిని తినేందుకు వాటికి సాధ్యమయేది కాదు. నేలపై ఉన్నవాటిని చూసే శక్తి వాటికి లేవ్ఞ. దీంతో అవి అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు అంటారు. ప్రస్తుతం క్రైస్తవ సంఘాలు కూడా ఇదే దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. తమది పెద్ద సంఘమని, తమ సంఘానికి ఇక సువార్తను ప్రకటించే అవసరం లేదని భావిస్తున్నారు

. భారతదేశంలో అగ్రవర్ణాలకు చెందిన సంఘాలు దళితులకు సువార్తను ప్రకటించడం లేదు. తమ సంఘాల్లో వారికి ప్రవేశం లేదు. ఒకవేళ వచ్చినా, అగ్రవర్ణాలతో సమానంగా కూర్చోకూడదు. నల్లజాతీయులకు సువార్తను ప్రకటించేందుకు తెల్లజాతివారు ఆసక్తి చూపించడంలేదు. తమ సంఘాల్లో వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. తద్వారా నేడు సంఘాలు వర్ధిల్లడం లేదు. పంట కోతకు సిద్ధంగా ఉన్నా, వాటికి కోసేందుకు పనివారు లేక, అవి ఎండిపోతున్నాయి. నేడు అనేకులు కూడా దేవ్ఞడి పట్ల ఆసక్తి ఉండి, కష్టాలు, కన్నీటి గుండా జీవిస్తున్నవారికి దేవ్ఞడికి సంబంధించిన నాలుగు మాటలకు నోచుకోలేకపోతున్నారు. తద్వారా వారు చెదరిపోయి, ప్రభువ్ఞకు దూరంగా జీవిస్తున్నారు.

శారీరక వాంఛలను తీర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభువ్ఞ ఇచ్చిన భారాన్ని ఏదో గెట్టుగేదర్‌ పేరుతో పార్టీలను చేసుకుంటున్నారు. సంఘంలో దేవ్ఞడికి అందరూ సమానమే. కానీ మనం మాత్రం బలహీనమైనవారిని, పేదలను, చదువ్ఞలేని వారిని పెద్దగా పట్టించుకోం. గొప్పఉద్యోగాలు చేస్తున్నవారిని, మంచి దుస్తులను ధరించినవారిని, ధనికులను, జ్ఞానవంతులను, చదువ్ఞకున్నవారిని గౌరవంచినంతగా పేదలను గౌరవించం. వారి ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉందో అనే చింత కూడా ఉండదు. వారు సంఘానికి రాకపోయినా ఎవరూ పట్టించుకోరు. వారు నశించి, నరకానికి సిద్ధంగా జీవిస్తున్నా, వారిని దేవ్ఞడి వాక్యంతో గద్దించాలి అనే భారం అసలే ఉండదు. దేవ్ఞడి మహాకృపను బట్టి మనం జీవిస్తున్నాం, దేవ్ఞడిలో అంటిపెట్టబడి ఉన్నాం. ఆ కృపను బట్టి ఇతరులను ప్రోత్సహించేందుకు ఎందుకు ఆసక్తి చూపించడం లేదు? వీరిని గురించి దేవ్ఞడు లెక్క అడుగుతాడు కదా? సమరయ స్త్రీ తన ఊర్లోకి వెళ్లి సువార్తను ప్రకటించింది. అనేకులను ప్రభువ్ఞవద్దకు నడిపించింది. నేడు సంఘాలకు ఈ భారం లేదు. ఆదివారం తమ సంఘాలకు వచ్చే క్రైస్తవ్ఞలతో తృప్తిపొందుతున్నారు. కొత్తవారు వచ్చినా, వారి ఆసక్తిని బట్టి వస్తున్నారే తప్ప, సంఘస్తుల ఆహ్వానమేరకు వచ్చేవారి శాతం తక్కువే. కాబట్టి మనం దేవ్ఞడు సువార్తపనిలో పడుతున్న కష్టం ఏపాటిది? సువార్త కోసం నిందులు, అవమానాలు, హింసలైనా పర్వలేదు అనుకునేవారు ఎంతమంది? ఇకనైనా దేవ్ఞడి సువార్తపట్ల శ్రద్ధ చూపిద్దాం. అనేకులు నశించి, నరకానికి వెళ్తున్నారు. వీరందరిని మనం కాపాడలేం. కానీ రెండుశాతమైనా దేవ్ఞడికి సమీపంలో చేర్చేందుకు కృషి చేద్దాం.

– పి.వాణీపుష్ప