సరిదిద్దుకునే సమయం ఇదే

JESUS-
JESUS-

సరిదిద్దుకునే సమయం ఇదే

‘యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా కార్యము నూతన పరుచుము సంత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము (హబక్కూకు 3:2) చివరి మాసంలోకి వచ్చేసాం. మరికొన్నిరోజుల్లో నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తాం. కాలప్రవాహంలో మరొక సంవత్సరం కలిసిపోనున్నది. ప్రముఖులు మరణించారు. పేరుప్రఖ్యాతలు, ఆస్తులు, అంతస్తులను కూడగట్టుకున్నవారు సైతం మరణించారు. వృద్ధాప్యచాయల్లోకి వెళ్లకుండానే చనిపోయిన వారెంతోమంది ఉన్నారు. అందమైన భవిష్యత్తు కోసం కలలు కన్నవారు సైతం గతించిపోయారు. మరణం ఎవరికీ చెప్పిరాదు. కానీ పుట్టినవారు గిట్టక తప్పదనే సత్యం అందరికీ తెలుసు.

తెలిసినా దేవుడిని వెంబడించడంలో నిర్లక్ష్యాన్నే ప్రదర్శిస్తున్నారు. సరే మనం సజీవలెక్కల్లో ఉన్నాం. మరి మరణించినవారికంటే మనం నీతిమంతులమా? లేక వారికంటే మన భక్తిగొప్పదా? ఎంతమాత్రం కానేకాదు. మనం జీవిస్తున్నాం అంటే అది కేవలం ప్రభువ్ఞ దయ అనే వాస్తవాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఎందుకోసం దేవ్ఞడు మనల్ని ఇంకా సజీవలెక్కల్లో ఉంచాడు? మనలో ఉన్న బలహీనతలు, లోపాలు, దాచిపెట్టుకున్న పాపం ఏవైనా ఉంటే సరిదిద్దుకునే అవకాశాన్ని దేవ్ఞడు ఇస్తున్నాడు.

మరి ఆ ప్రయత్నం ఎంతమంది చేస్తున్నారు? దినాలు గడిచేకొద్దీ మనం ప్రభువ్ఞకు సమీపంలోకి పయనించేందుకు ప్రయత్నించాలి. ప్రార్థన, వాక్యం, సహవాసం, ఇతరులను ప్రోత్సహించడం వంటివన్నీ చేస్తూ, దేవ్ఞడికి మరింతగా దగ్గరకురావాలి. ఇదే దేవ్ఞడు మననుంచి కోరుతున్నది. అంతేతప్ప దేవ్ఞడు ఆయుష్షును ఇస్తున్నాడు అంటే ఈలోకంలో ఆనందించేందుకు, సుఖించేందుకు కాదు. దేవ్ఞడికి సాక్షులుగా ఉండాలి, అనేకులను ఆయన మార్గంలోకి పయనించేలా చేయాలి.

సరే ఈ ఏడాది అంతా ఎలా జీవించారు అనేది కాదు ముఖ్యం. కనీసం ఈ చివరిమాసంలోనైనా దేవ్ఞడు ఆశించిన ఆధ్యాత్మిక జీవితంలోకి పయనించేందుకు ప్రయత్నించాలని దేవ్ఞడు కోరుతున్నాడు. బలహీనతలు, సమస్యలు ఏవైనా సరే వాటన్నింటిని ప్రభువ్ఞపై భారం వేసి, పోరాడే ప్రార్థనాజీవితం, వాక్యానుసారమైన నడవడికతో పయనించేందుకు నేడు అనే దినం ఉండగానే సరిదిద్దుకుని, కొత్తసంవత్సరంలో నూతన వాగ్దానాలతో దేవ్ఞడు ఆశించిన విధానంలో ప్రవేశించేందుకు ప్రభువ్ఞ సాయం చేయునుగాక..

– పి.వాణీపుష్ప