ఆ సంపదను తిరిగి సంపాదించుకున్న జెఫ్ బెజోస్

విడాకుల కారణంగా కోల్పోయినా..40 బిలియన్ డాలర్లు

Jeff Bezos
Jeff Bezos

అమెరికా: అమెజాన్ వ్యవస్థాపక సీఈఓ జెఫ్ బెజోస్ గత సంవత్సరం మెకెంజీతో విడిపోతున్న వేళ, తన ఆస్తిలోని 25 శాతం మొత్తాన్ని ఆమెకు ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన ఆస్తి విలువ దాదాపు 167 డాలర్లు కాగా, ఇటీవలి కాలంలో అమెజాన్ ఈక్విటీ విలువ పెరుగుతూ రావడంతో, జెఫ్ బెజోస్ సంపద 172 బిలియన్ డాలర్లను తాకింది. బుధవారం నాడు యూఎస్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో సంస్థ ఈక్విటీ విలువ 4.4 శాతం పెరిగి 2,879 డాలర్లకు చేరుకుంది. దీంతో బెజోస్ సంపద 171.6 బిలియన్ డాలర్లను తాకింది. మెకెంజీకి విడాకులు ఇచ్చే నాటికి, అంటే… సెప్టెంబర్ 2018 నాటికి బెజోస్ సంపద 167.7 బిలియన్ డాలర్లని బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ చెబుతోంది. విడాకుల తరువాత ఆయన ఆస్తిలో 40 బిలియన్ డాలర్లకు పైగా భార్యకు ఇవ్వాల్సి వచ్చింది. తిరిగి రెండేళ్లలోపే ఆయన ఆ మొత్తాన్ని తిరిగి సంపాదించుకున్నారు. దీంతో తన సంపద రికార్డును తానే బద్దలు కొట్టినట్లయింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/