వైఎస్‌ఆర్‌సిపిలోకి జీవిత, రాజశేఖర్‌లు

jeevita rajasekhar, jagan hema
jeevita rajasekhar, jagan hema


హైదరాబాద్‌: సినీ నటులు జీవిత, రాజశేఖర్‌ వైఎస్‌ఆర్‌సిపిలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ సమక్షంలో వారు పర్టీ కండువా కప్పుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఈ ఉదయం వారు జగన్‌తో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం వారు వైఎస్‌ఆర్‌సిపిలో చేరారు. వీరితో పాటు సినీ నటి హేమ కూడా వైఎస్‌ఆర్‌సిపిలో చేరారు.
సమావేశం అనంతరం జీవిత, రాజశేఖర్‌ మీడియాతో మాట్లాడారు. జగన్‌తో తొలుత మనస్పర్దలు వచ్చిన మాట నిజమేనని, వాటిని ఇంకా పొడిగించకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. జగన్‌లో గతంతో పోలిస్తే ప్రస్తుతం చాలా మార్పు వచ్చిందని అన్నారు. చంద్రబాబు, జగన్‌ ఇద్దరిలో రాబోయే సియంగా జగన్‌ ఐతే బావుంటుందని రాజశేఖర్‌ అభిప్రాయపడ్డారు. జగన్‌ సియం అయ్యేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/