జెఈఈ మెయిన్స్ షెడ్యూల్ విడుదల

సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు నిర్వహణ

JEE Mains Schedule
JEE Mains Schedule

జేఈఈ మెయిన్స్‌ 2020 పరీక్షల షెడ్యూల్ ఎట్టకేలకు ఖరారైంది. సెప్టెంబర్‌ 1 నుంచి 6 జేఈఈ మెయిన్స్ వరకు నిర్వహించాలని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 

జేఈఈ ప్రధాన పరీక్షలు యూపీఎస్‌సీ, ఎన్‌డీఏ పరీక్షల తేదీలు క్లాష్‌ అవుతుండడంతో జేఈఈ పరీక్ష తేదీల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది.

మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోక్రియాల్‌ నిశాంక మాట్లాడుతూ ఎన్‌డీఏతో జేఈఈ మెయిన్‌ పరీక్ష తేదీలు క్లాష్‌ నేపథ్యంలో చాలా మంది విద్యార్థుల నుంచి  ప్రతిపాదనలు వచ్చాయన్నారు.

ఈ విషయాన్ని  పరిశీలించి, . సెప్టెంబరు 6న జరగాల్సిన ఎన్‌డీఏ పరీక్షలో జేఈఈ మెయిన్‌ పరీక్ష రాసే విద్యార్థులు కూడా కొంతమంది హాజరు కానున్నట్లు తెలిసింది.

రెండు పరీక్షల్లో హాజరయ్యే అభ్యర్థుల కోసం రెండు పరీక్షలు ఒకే రోజు జరుగకుండా ఎన్‌టీఏ మరో తేదిని నిర్ధారిస్తుందని ట్వీట్‌ చేశారు.

జేఈఈ మెయిన్‌ పరీక్షల కోసం సుమారు 9 లక్షలకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/