7వ తేదీ వరకు జేఈఈ మెయిన్‌ దరఖాస్తుల స్వీకరణ

jee main
jee main

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్‌ఐటీ, జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 7 నుంచి 20 వరకు నిర్వహించే ఆన్‌లైన్ జేఈఈ మెయిన్ పరీక్షలకు ఈ నెల 7 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆన్‌లైన్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈ నెల 8 వరకు గడువు విధించినట్లు ఎన్టీఏ అధికారులు తెలిపారు. జనవరిలో నిర్వహించిన జేఈఈ మెయిన్‌కు హాజరైన వారు ఈ పరీక్షలకు దరఖాస్తులు చేసుకోవచ్చని, నిబంధనలు పాటించాలని తెలిపారు. ఏప్రిల్‌లో నిర్వహించే ఆన్‌లైన్ జేఈఈ మెయిన్ పరీక్షలకు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్, కోదాడ, నిజామాబాద్ మొత్తం తొమ్మిది ప్రాంతాలను ఎంపిక చేశారు. పూర్తి వివరాలకు జేఈఈ మెయిన్ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.