పోలీస్‌ కస్టడీకి జేసీ ప్రభాకర్ ‌రెడ్డి

7 గంటల కస్టడీకి అనుమతించిన న్యాయమూర్తి

jc-Prabhakar-Reddy-in-police-custody

కడప: మాజీ ఎమ్మెల్యె జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం కడప సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయను పోలీసులు మరోమారు కస్టడీకి తీసుకున్నారు. ఆయన్ను ప్రశ్నించేందుకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీసులు కోర్టు అనుమతి కోరగా, న్యాయమూర్తి 7 గంటల పాటు ప్రశ్నించేందుకు అనుమతించారు. దీంతో ఆయన్ను జైలు నుంచి పోలీసు అధికారులు తీసుకుని వెళ్లారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లపై ఓర్వకల్లు పీఎస్ లో కూడా ఓ కేసు నమోదై ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన్ను పోలీసులు కస్టడీ కోరగా, కోర్టు అనుమతించింది. నేటి సాయంత్రం కస్టడీ సమయం ముగిసిన తరువాత తిరిగి ఆయన్ను కడప కేంద్ర కర్మాగారానికి తరలించనున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/