జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు బెయిల్

jc-prabhakar-reddy

అనంతపురం: వాహనాల రిజిస్ట్రేషన్‌లో అక్రమాల కేసులో అరెస్టయిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యె జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన కుమారుడు ఆస్మిత్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరైంది. రేపు కడప జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీఎస్‌3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా మార్చి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారన్న అభియోగంపై జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. అలాగే నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు తయారు చేశారన్న దానిపై కూడా జేసి ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసి అశ్విత్‌రెడ్డిపై అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జూన్ 13న హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో వారి నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కడప జిల్లాకు తరలించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/