‘ఎన్టీఆర్’ లో పాత తరం స్టార్ హీరోయిన్ల గ్లామర్?

Jayasudha , Jayapradha
Jayasudha , Jayapradha

ఎన్టీఆర్’ రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకూ దాదాపుగా సినిమాకు సంబంధించిన ఎదో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వస్తూనే ఉంది.  క్రిష్ ఈ సినిమాలో కూసంత గ్లామర్ యాడ్ చేయాలని కంకణం కట్టుకున్నట్టుగా ఉన్నాడు. విద్యా బాలన్ విషయం పక్కన పెడితే..  ఈ సినిమాలో ఇప్పటికే బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ను అతిలోక సుందరి శ్రీదేవి పాత్రకు ఎంచుకున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఈ సుందరితో పాటుగా మరో ఇద్దరు టాలీవుడ్ సుందరాంగులను పాత తరం స్టార్ హీరోయిన్లు అయిన జయప్రద – జయసుధ పాత్రలకు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట.  వీరిద్దరూ ఎన్టీఆర్ తో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.   క్రిష్ ఇప్పటికే ఇద్దరు నవతరం నటీమణులతో జయప్రద – జయసుధ పాత్రల కోసం సంప్రదింపులు జరుపుతున్నాడని త్వరలో ఆ సుందరీమణులు ఎవరో బయటకు వస్తుందని సమాచారం.