జయరాం కోమటికి మాతృవియోగం

పలువురు ఎన్నారైలు సంతాపం

Jayaram Komati- kamalamma komati (file)
Jayaram Komati- kamalamma komati (file)

Mailavaram (Krishna District-AP): ఉత్తర అమెరికా తెలుగు సంఘం మాజీ అధ్యక్షుడు, ఎపి ప్రభుత్వ మాజీ ప్రతినిధి జయరాం కోమటికి మాతృవియోగం కలిగింది.

ఆయన తల్లి కోమటి కమలమ్మ(85) మైలవరంలో గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆమె భర్త కోమటి భాస్కరావు కృష్ణాజిల్లా మైలవరం ఎమ్మెల్యేగా పనిచేశారు.

కమలమ్మకు ముగ్గురు సంతానం. పెద్దకుమారుడు జయరాం కోమటి అమెరికాలో ఉంటున్నారు. చిన్నకుమారుడు సుధాకర్‌ కోమటి, కుమార్తె మైలవరంలో ఉంటున్నారు.

కరోనా వైరస్‌ ప్రభావంతో అమెరికా నుంచి ఇండియాకు వచ్చే అవకాశాలు లేకపోవటంతో జయరాం కోమటి తాను ఇండియాకు వెళ్లలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందని పేర్కొన్నారు.

ఇవాళ ఉదయమే తమ తల్లి అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు చిన్నకుమారుడు సుధాకర్‌ కోమటి తెలిపారు. కమలమ్మ మృతికి పలువురు సంతాపం తెలిపారు.

జయరాం కుటుంబానికి పలువురు ఎన్నారైలు సానుభూతి వ్యక్తం చేశారు.

తానా మాజీ అధ్యక్షుడు సతీష్‌ వేమన, తానా కార్యదర్శి రవి పొట్లూరి, హరనాధ్‌ పొలిచర్ల, బే ఏరియాలో బాటా నేతలు, తానా నాయకులు, చెన్నూరు వెంకటసుబ్బారావు తదితరుల సంతాపం తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/