సినీ న‌టి జ‌యప్ర‌ద బిజెపి తీర్ధం

jayaprada
jayaprada, actress

అల‌నాటి సినీ తార జ‌య‌ప్ర‌ద బీజేపీ తీర్ధం పుచ్చుకుంది. గ‌తంలో ప‌లు పార్టీల‌కి పని చేసిన జ‌య‌ప్ర‌ద ఎంపీగా కూడా ప‌ని చేశారు. తాజాగా ఆమె బీజేపీ కండువా క‌ప్పుకుంది. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని రామ్‌పుర్ నియోజ‌క వ‌ర్గం నుంచి తాను పోటీ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఎస్పీ నాయకుడు ఆజంఖాన్‌పై జయప్రద పోటీ చేసే చాన్సుంది. 2004 నుంచి 2014 వరకు ఇదే నియోజకవర్గం నుంచి ఎస్పీ తరఫున జయప్రద ఎంపీగా కొనసాగారు.