వంద కోట్ల బడ్జెట్‌తో జయలలిత బయోపిక్‌

sasilalita
sasilalita

తమిళనాడు మాజీ సియం జయలలిత జీవిత కథ నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కనుండగా, కొన్ని ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉన్నాయి. ఇప్పుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి జయలలిత జీవితం నేపథ్యంలో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు. ‘శశిలలిత’ పేరిట తెరకెక్కనున్న ఈ చిత్రంలో జయలలిత ఆస్పత్రిలో ఉన్న 75 రోజులు ఏం జరిగింది అనేది చూపించబోతున్నారు. మరోవైపు కోలీవుడ్‌లో తమిళ దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్‌ లేడి’ పేరుతో, తమిళ దర్శకుడు ఏఎల్‌ విజ§్‌ు తాను తలైవి అనే టైటిల్‌తో , వైబ్రీ మీడియా, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తున్నారు. వంద కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుపుతుండగా, ఇందులో జయలలిత నట ప్రస్థానంతో పాటు రాజకీయ ప్రస్థానం చూపించనున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/