ఆస్కార్ గెలిచిన జాతిరత్నాలు.. చెవిలో పువ్వే!

టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ జాతిరత్నాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు అనుదీప్ మలిచిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు పరుగులు తీశారు. ఇక ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి చేసిన కామెడీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

పక్కా కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా భారీ కలెక్షన్లు వసూళు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జాతిరత్నాలు చిత్రానికి బెస్ట్ జానేజిగర్ విభాగంలో ఉత్తమ చిత్రంగా ఆస్కార్ నామినేషన్ లభించిందనే పోస్టర్ ప్రస్తుతం టాలీవుడ్‌లో దర్శనిమిస్తోంది. దీంతో ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. జాతిరత్నాలు చిత్రం ఆస్కార్ అవార్డ్ ఎప్పుడు గెలిచిందబ్బా అంటూ వారు తలలు పట్టుకుంటున్నారు.

అయితే ఈరోజు ఏప్రిల్ 1 కావడంతో, ఆల్ ఫూల్స్ డే సందర్భంగా జాతిరత్నాలు చిత్ర యూనిట్ ప్రేక్షకులను బకరాలు చేసింది. అందుకే ఈ పోస్టర్‌ను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అసలు విషయం తెలుసుకున్న ప్రేక్షకులు ఏప్రిల్ ఫూల్ అయ్యామని ఫీలవుతున్నారు. ఏదేమైనా కామెడీ జోనర్‌లో వచ్చిన జాతిరత్నాలు చిత్రం ప్రేక్షకులు ఈ విధంగా నవ్వించే ప్రయత్నం చేసిందని పలువురు అంటున్నారు.