బిగ్ బాస్ 5 : నటరాజ్ మాస్టర్ ను పక్క ప్లాన్ తో ఇంటికి పంపించారా..? జెస్సి పెద్ద బాంబ్ పేల్చాడు

బిగ్ బాస్ 5 : నటరాజ్ మాస్టర్ ను పక్క ప్లాన్ తో ఇంటికి పంపించారా..? జెస్సి పెద్ద బాంబ్ పేల్చాడు

బిగ్ బాస్ 5 ఐదో వారం లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రతి సోమవారం లాగానే ఈరోజు కూడా నామినేషన్ల పర్వం సాగింది. ప్రతివారం ఒక్కో కంటెంస్టెంట్ ఇద్దరిద్దరు చొప్పున డైరెక్ట్ నామినేషన్ చేసేవారు.. అయితే ఐదో వారంలో సీక్రెట్‌ నామినేషన్ ప్రక్రియ చేపట్టారు.. కన్వెషన్ రూంకి వెళ్లి ఒక్కొక్కరు ఇద్దరిద్దరు చొప్పున నామినేట్ చేయాలని చెప్పారు బిగ్ బాస్. దీంతో ముందుగా కన్వెషన్ రూంకి వెళ్లిన జెస్సీ.. యాంకర్ రవి, లోబో ను నామినేట్ చేసాడు. ఆ తర్వాత సన్నీ.. షణ్ముఖ్, ప్రియ లను , విశ్వ.. జెస్సీ, షణ్ముఖ్ జస్వంత్ లను , కాజల్.. యాంకర్ రవి, సన్నీ లను, లోబో.. మానస్, షణ్ముఖ్ లను, ప్రియాంక.. హమీదా, లోబోలను, సిరి.. యాంకర్ రవి, హమీదా లను, యాంకర్ రవి.. జెస్సీ, షణ్ముఖ్ జస్వంత్ లను, ఆనీ మాస్టర్.. యాంకర్ రవి, విశ్వ లను.. షణ్ముఖ్ జస్వంత్.. విశ్వ, మానస్ లను చేశారు.

అంతకంటే ముందు ఎలిమినేట్ అయిన నటరాజ్‌ మాస్టర్ గురించి సిరి, షణ్ముఖ్, జెస్సీలు మాట్లాడారు. లోబోని ప్రియపై అరిచేలా చేసింది యాంకర్ రవినే అంటూ.. నేను చెప్పినట్టు చేస్తే నువ్ గేమ్‌లో ముందుకు వెళ్తావ్ అని హమీదాతో కూడా రవి అన్నాడట అంటూ కోడ్ లాంగ్వేజ్‌లో సిరి, షణ్ముఖ్‌లకు చెప్పాడు జెస్సీ. నా దగ్గర ఏం ప్లానింగ్ లేదురా.. కానీ రవి పక్కా ప్లానింగ్‌తో ఆడారు. లోబోని ఉపయోగించి నటరాజ్ మాస్టర్‌ని బయటకు పంపాడు. వేటడతాను అదీ ఇది అని చెప్పిన నటరాజ్ మాస్టర్.. లోబోతో దోస్తీ చేసి బావా బావా అన్నారు. చివరికి ప్లాన్ చేసి బావనే పంపేశారు. నటరాజ్ మాస్టర్ చేసిన మిస్టేక్ అదే అని అన్నారు జెస్సీ, షణ్ముఖ్‌లు. అయితే యాంకర్ రవి నిజంగానే ప్లాన్ చేసి ఇదంతా చేస్తున్నాడా? లోబోని అస్త్రంగా ఉపయోగించుకుంటున్నాడా? జెస్సీ చెప్పేది నిజమేనా లేదంటే అతనిపై కోపంతో ఇదంతా చెప్తున్నాడా? అన్నది తెలియాల్సి ఉంది.