బుమ్రా 57 వన్డేల్లో వంద వికెట్ల రికార్డు

Jasprit Bumrah
Jasprit Bumrah

లీడ్స్‌: ప్రపంచకప్‌ చివరి లీగ్‌ మ్యాచులో టీమిండియా బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో కరుణరత్నే వికెట్‌ తీసిన బుమ్రా ఖాతాలో వంద వికెట్లు చేరాయి. ఫలితంగా అతి తక్కువ వన్డేల్లో ఆ మైలురాయిని చేరుకున్న రెండో ఇండియన్‌గా బుమ్రా రికర్డులకెక్కాడు. బుమ్రాకు ఇది 57వ వన్డే కాగా, 56 వన్డేల్లోనే వంద వికెట్లు పడగొట్టిన మహ్మద్‌ షమీ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో ఇర్ఫాన్‌ పఠాన్‌(59), జహీర్‌ఖాన్‌(65), అజిత్‌ అగార్కర్‌(67), జవగల్‌ శ్రీనాథ్‌(68) ఉన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/