ప్రపంచ అత్యుత్తమ బౌలర్‌ బుమ్రా

కివీస్‌ ఓపెనర్‌ గుప్టిల్‌ సంచలన వ్యాఖ్య

Jasprit Bumrah
Jasprit Bumrah

వెల్లింగ్టన్: రెండో టీ20లో న్యూజిలాండ్ ఓటమికి టీమిండియా సమిష్టి ప్రదర్శనే కారణమని కివీస్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా ఈడెన్‌ పార్క్‌ ట్రాక్‌ స్లోగా స్పందించిన కారణంగానే తాము బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోయామని తెలిపాడు. మ్యాచ్ అనంతరం టీమిండియా పేసర్ జస్ప్రీత్‌ బుమ్రాపై గుప్టిల్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. గుప్టిల్ మాట్లాడుతూ.. పిచ్‌ సహకరించని కారణంగా సరైన భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం. అయితే, పిచ్‌ నుంచి వచ్చిన సహకారాన్ని టీమిండియా బౌలర్లు బాగా సద్వినియోగం చేసుకున్నారు. బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. చివరి వరకు బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి మమ్మల్ని నియంత్రించాడు అని గుప్టిల్ అన్నాడు. బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొనడం చాలా కష్టంగా మారింది. మేము 170 పరుగులు చేస్తే పోరాడే వాళ్లం. కానీ టీమిండియా అద్భుతమైన బౌలింగ్‌తో అది సాధ్యం కాలేదు. భారత బౌలర్లు చాలా బంతులను డాట్‌ బాల్స్‌గా సంధించారు. దీంతో సాధ్యమైనన్ని పరుగులు చేయలేకపోయాం. మరోవైపు భారత్‌ బ్యాటింగ్‌లో కూడా రాణించింది అని గుప్టిల్ చెప్పుకొచ్చాడు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/