గాయం నుంచి కోలుకుని ప్రాక్టీస్‌లో బుమ్రా

jasprit bumrah
jasprit bumrah


బెంగళూరు: ముంబై ఇండియన్స్‌ బౌలర్‌ జస్ప్రిత్‌ బుమ్రా మంగళవారం తన సహచర ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఆదివారం ధిల్లీతో మ్యాచ్‌ సందర్భంగా మొదటి ఇన్నింగ్స్‌ చివరి బంతికి బుమ్రా గాయపడిన సంగతి తెలిసిందే. రిషబ్‌పంత్‌ కొట్టిన షాట్‌ను ఆపబోతుండగా ఎడమ భుజానికి గాయమైంది. ఈ నేపథ్యంలో బుమ్రా గాయంపై పెద్ద చర్చ జరుగుతుంది. మరో రెండు నెలల్లో ప్రపంచకప్‌కు సన్నధ్దమవుతున్న సమయంలో బుమ్రాకు ఇలా జరగడం బాధాకరం. బుమ్రా కోలుకుంటున్నాడని, అతడికి గాయం కాలేదని ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం ఇదివరకే ప్రకటించింది.
మరోవైపు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరుతో ముంబై గురువారం మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. దీంతో సోమవారమే ఆ జట్టు బెంగుళూరు చేరుకుని ప్రాక్టీస్‌ మొదలుపెట్టింది. కానీ బుమ్రా సోమవారం జట్టుతో కలిసి రాకుండా మంగళవారం బెంగుళూరు చేరుకున్నాడు.