సెక్సీ ఐటెం సాంగ్

Jaqueline in saaho
Jaqueline in saaho

డార్లింగ్ ప్రభాస్ మోస్ట్ వాంటెడ్ మూవీ సాహో వచ్చే నెలే విడుదల కానుంది. ఆగస్ట్ 15 రానున్న ఈ విజువల్ వండర్ కోసం అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ఆస్ట్రియాకు పాటల చిత్రీకరణ కోసం వెళ్లిన యూనిట్ వాటిని పూర్తి చేసుకుని తిరిగి వచ్చేసింది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం బాలీవుడ్ సెక్సి బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండేజ్ తో  అహో అనే రేంజ్ లో ఓ ఐటెం సాంగ్ షూట్ చేశారట. దీనికి థియేటర్లు అభిమానుల గోలతో మోగిపోవడం ఖాయం అంటున్నారు.

జాక్వలిన్ మంచి డాన్సర్. తుజే అఖియా మిలాకే సయ్యా పాట కోసమే డిజాస్టర్ సినిమా రాయ్ ను చూసిన ప్రేక్షకులు ఉన్నారు. అడపాదడపా హిట్లు ఐటెం సాంగులు చేస్తున్న జాక్వలిన్ ఉంటే సాహోకు ఖచ్చితంగా స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. ఇది ఆడియో సింగిల్స్ విడుదల చేసే క్రమంలో చివరిలో వదులుతారని తెలుస్తోంది.