జపాన్‌ మాజీ ప్రధాని కన్నుమూత

Japan's Ex-Prime Minister Yasuhiro
Japan’s Ex-Prime Minister Yasuhiro

టోక్యో : జపాన్‌ మాజీ ప్రధాని, నేవీ లెఫ్టినెంట్‌ యసుహిరో (101) మృతిచెందారు. అనారోగ్య సమస్యలతో ఆయన తుది శ్వాసవిడిచినట్టు కుటుంబ సభ్యులు, సన్నిహితులు తెలిపారు. జపాన్‌ను సుదీర్ఘ కాలం పాలించిన నేతగా యసుహిరో పేరు తెచ్చుకున్నారు. అమెరికా దివంగత మాజీ అధ్యక్షుడు రొనాల్డ్‌ రీగన్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు. 1982 నుంచి 1987 వరకు జపాన్‌ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. జపాన్‌ రాజ్యాంగాన్ని పున: సమీక్షించడంలో తాను విఫలమైనట్టు అనేక మీడియా సమావేశాల్లో చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/