ఎలాంటి షరతులు లేకుండా కిమ్‌ను కలుస్తా

ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల్లో తెలిపిన.. యోషిహిడే

yoshihide suga

జపాన్‌: జపాన్ ప్రధాని పదవికి షింజో అబే రాజీనామా చేసిన అనంతరం కొత్త ప్రధాని యోషిహిడే సుగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఉత్తరకొరియాతో ఉన్న విభేదాల విషయంపై ఆయన కీలక ప్రకటన చేశారు. ఎలాంటి షరతులు లేకుండా తాను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ను కలిసేందుకు సిద్ధమని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల్లో భాగంగా తెలిపారు. జపాన్‌కొరియాల మధ్య ప్యాంగ్యాంగ్‌లో జరిగిన‌ ఒప్పందం ప్రకారం తాము ఉత్తరకొరియాతో సత్సంబంధాలను కొనసాగించాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య సమన్వయంతో శాంతి, స్థిరత్వం సాధించాలని తాము భావిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, 2002లో జపాన్‌ఉత్తరకొరియా న్యూక్లియర్‌, క్షిపణుల‌ సంబంధ విషయాలపై ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశాయి.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/