తెలంగాణ మొత్తం నిర్మానుష్యం

జనతా కర్ఫ్యూనకు ప్రజాస్పందన

Janata curfew

Hyderabad: ప్రధాని నరేంద్రమోడీ  పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ తెలంగాణలో సంపూర్ణంగా జరుగుతోంది. తెలంగాణలో అయితే ఈ జనతా కర్ఫ్యూ 24 గంటల పాటు పాటించాలంటూ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పిలుపునకు జనం స్పందించారు. 

తెలంగాణ మొత్తం నిర్మానుష్యంగా మారిపోయిందా అన్నట్లుగా రహదారులన్నీ ఖాళీగా ఉన్నాయి.

దేశ వ్యాప్తంగా అయితే ఉదయం ఏడు గంటల నుంచీ రాత్రి 9గంటల వరకూ జనతా కర్ఫ్యూ పాటిస్తుంటే..తెలంగాణ రాష్ట్రంలో జనతా కర్ఫ్యా 24 గంటలు పాటిస్తున్నారు.

ఉదయం 6 గంటలకే జనతా కర్ఫ్యూ తెలంగాణలో ఆరంభమైంది. రాజధాని  హైదరాబాద్‌‌లోని   రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.  క్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాలు వెలవెలబోతున్నాయి.

అ  బస్సులు, మెట్రో రైళ్లు ఇప్పటికే డిపోలకు పరిమితమయ్యాయి.  జనతా కర్ఫ్యూ ప్రభావంతో ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లు ఖాళీగా ఉన్నాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/