ఈ నెల 09 న తెలంగాణ జనసేన నేతలతో పవన్ సమావేశం

ఈ నెల 09 న తెలంగాణ జనసేన నేతలతో పవన్ సమావేశం

పవన్ కళ్యాణ్ మళ్లీ రాజకీయాల్లో బిజీ అయ్యారు. రీసెంట్ గా వైసీపీ ప్రభుత్వం ఫై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేసారు. కేవలం ఏపీలోనే కాదు తెలంగాణ లోను పార్టీ ఫై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఈ నెల 09 న తెలంగాణ జనసేన నేతలతో సమావేశం కాబోతున్నారు.

ఇప్పటికే ఈ భేటీకి జనసేన క్రియాశీలక కార్యకర్తలకు ఆహ్వానాలు పంపించడం జరిగినట్లు తెలుస్తుంది. హైదరాబాద్‌ అజీజ్‌ నగర్‌లోని జీపీఎల్‌ కన్వెన్షన్‌ 9వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. పార్టీ నిర్మాణంలో భాగంగా తెలంగాణలో క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తూ కమిటీల నియామకం సాగుతోంది. ఈ క్రమంలో పార్టీలో క్రియాశీలక సభ్యులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీని ముందుకు తీసుకెళ్లడం, సంస్థాగత నిర్మాణం, ప్రజల పక్షాన నిలబడి పోరాడటంపై కార్యకర్తలు, నాయకులకు దిశానిర్ధేశం చేయనున్నారు పవన్.