తిరుపతి రైతు బజార్‌లో పవన్‌ కళ్యాణ్‌


anaSena Party Chief Sri Pawan Kalyan Visit to Tirupati Raithu Bazar

తిరుపతి: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తిరుపతిలో నిర్వహించిన తెలుగు భాషా ఆత్మీయుల సమావేశంలో పాల్గొన్న విషయం తెలిసిందే. కాగా తిరుపతిలోనే ఉన్న ఆయన అక్కడి రైతు బజారును సందర్శించారు. ఉల్లికోసం బారులు తీరిన ప్రజలను కలిసి వారితో మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ప్రజలు ఉల్లికోసం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని ఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని పాలించే సమర్థత లేకుంటే తప్పుకుని మళ్లీ ఎన్నికలకు రావాలని ఆయన డిమాండ్‌ చేశారు. తప్పులను గత ప్రభుత్వాలపై పెట్టడం సమస్యకు పరిష్కారం కాదని, ప్రణాళికలు చేయడంలో ప్రభుత్వం విఫలమయిందని పవన్‌ కళ్యాణ్‌ విమర్శించారు. రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత మాదిరిగానే ఉల్లి కోసం కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/