అమరావతి రైతులతో పవన్ కళ్యాణ్

JanaSena Party Chief Pawan Kalyan Interaction with Amaravati Farmers Mangalagiri


అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మంగళగిరిలో పోలీసుల దాడిలో గాపయడిన అమరావతి రైతులను పరామర్శించారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వాన్ని కూల్చేవరకు జనసేన నిద్రపోదని పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ.. అమరావతికి శాశ్వత రాజధాని ఇక్కడే ఉండాలన్నారు. ఇంత మంది రైతులతో కన్నీళ్లు పెట్టించారన్నారు. వైఎస్‌ఆర్‌సిపి నేతలు ఫ్యాక్షన్ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నారన్నారు. రాజధాని ఇక్కడే ఉండాలని సమిష్టి నిర్ణయం జరిగిందన్నారు. ఒకే సామాజిక వర్గం, ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/