5 సంయుక్త పార్లమెంటరీ కమిటీల ఏర్పాటు: జనసేన

Pawan kalyan
Pawan kalyan

అమరావతి: త్వరలో ఏపిలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ పంచాయతీల నుంచి బలోపేతం చేసేందుకు పూనుకుంది. తాజాగా జనసేన సంయుక్త పార్లమెంటరీ కమిటీలను ప్రకటించారు. ఏపీలో 25 లోక్ సభ స్థానాలు ఉండగా, 5 సంయుక్త పార్లమెంటరీ కమిటీలను నియమించారు. ఉత్తరాంధ్ర సంయుక్త కమిటీ, గోదావరి సంయుక్త కమిటీ, సెంట్రల్ ఆంధ్ర సంయుక్త కమిటీ, రాయల దక్షిణ కోస్తా సంయుక్త కమిటీ, రాయలసీమ సంయుక్త కమిటీలను ఏర్పాటు చేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు జనసేనాని పవన్ కల్యాణ్, రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ నుంచి ఓ ప్రకటన వెలువడింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/