సీఎం జగన్‌ చిత్రపటానికి పాలభిషేకం చేసిన రాపాక

cm jagan & rapaka varaprasad
cm jagan & rapaka varaprasad

అమరావతి: జనసేన ఎకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ వ్యవహార శైలి మరోసారి చర్చలకు దారితీసింది. ఒక వైపు జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ సీఎం జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తుంటే రాపాక మాత్రం ముఖ్యమంత్రి జగన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్‌ జన్మదినం సందర్భంగా ఆయన తూర్పుగోదావరి జిల్లా సఖినేటి మండలం మోరిలో జరిగిన వైఎస్సార్‌ నేతన్న నేస్తం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రాపాక పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్‌ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఇదిలా ఉంటే పవన్‌ కళ్యాణ్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. జనసేన కమిటీ రాజధాని రైతులకు మద్దతు ప్రకటించి కూడా రోజు గడవక ముందే పవన్‌కి భారీ షాక్‌ తగిలింది. సీఎం జగన్‌ నిర్ణయానికి మెగాస్టార్‌ చిరంజీవి సైతం జైకొట్టారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్‌ ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తారన్న నమ్మకం తనకు ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల విషయంలో చిరంజీవి సానుకూల వ్యాఖ్యలు చేయడం పవన్‌కి ఇబ్బందికరంగా మారనున్నాయన్న అభిప్రాయాల వ్యక్తమవుతున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/