టిడిపి అవినీతిపై రాపాక ఫైర్‌

rapaka vara prasada rao
rapaka vara prasada rao

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభా సమావేశాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ టిడిపి పైన మండి పడ్డారు. సభలో ప్రశ్నోతారాలు కొనసాగుతున్న సమయంలో తన నియోజవర్గం అయిన రాజోలులో రహదారుల గురించి రాపాక ప్రస్తావించారు. ఆ సమయంలో టిడిపి హాయంలో ఉపాధి హామీ పనుల్లో భారీగా అవినీతి చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు. గతంలో రాజోలు నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించిన టిడిపి ఎమ్మెల్యే సూర్యారావు ఎటువంటి డెవలప్‌ మెంట్‌ చేయలేదన్నారు. సూర్యారావు మాత్రం ప్రభుత్వ సొమ్ము కోట్లాది రుపాయలతో సొంతంగా కాలేజి నిర్మించుకున్నారని దుయ్యబట్టారు. అదే సమయంలో రాపాక మాట్లాడుతుంటే టిడిపి సభ్యులు అల్లరి చేస్తు అడ్డు తగిలారు. దీంతో టిడిపి సభ్యుల తీరుపై ఆయన స్పీకర్‌కు నివేదించగా స్పీకర్‌ తమ్మినేని సీతారాం స్పందించారు. టిడిపి సభ్యులు ఇబ్బంది కలిగిస్తున్నారని అదే విషయం వారికి పలుమార్లు చెప్పానని స్పీకర్‌ గుర్తు చేశారు. ఈ వ్యవహారం పైన మీరు వారిపైన చర్యలు కోరుతూ ఎందుకు ప్రయివేటు తీర్మానం ప్రవేశ పెట్టకూడదంటూ రాపాకకు సూచన చేశారు. దీనికి సరే అన్నట్లుగా రాపాక స్పీకర్‌కు నమస్కారం చేస్తూ..అంగీకారం తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/