పవన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన ఎమ్మెల్యే

rapaka varaprasad
rapaka varaprasad

అమరావతి: జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ షాక్‌ ఇచ్చినట్టు ఫేక్‌ న్యూస్‌ ప్రచారం అవుతుంది. ఈ రోజు కాకినాడలో జరిగిన రైతు సౌభాగ్య దీక్షకు రాపాక హాజరుకాకపోవడంపై పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారని, దీనిపై వివరణ ఇవ్వాలంటూ షోకాజ్‌ నోటీస్‌ జారీచేసినట్టు ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రాపాక వరపస్రాద్‌ పవన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఎవరో షోకాజ్‌ నోటీసు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. తాను గెలిచిన ఎమ్మెల్యేనని, వారు ఓడిపోయిన వారు అని గుర్తు చేశారు. జనసేన పార్టీపై ఎవరికైనా అధికారం ఉందీ అంటే..అది తనకొక్కడికేనని స్పష్టం చేశారు రాపాక. ఎవరి దయాదాక్షిణ్యాలతో గెలవలేదని, తన శక్తితో మాత్రమే గెలిచానని వివరించారు. తనకు ఎవరి భిక్ష అవసరం లేదన్నారు. తనను గెలిపించే వాళ్లే అయితే, వారెందుకు రెండె చోట్లా ఓడిపోయారని పవన్‌ కళ్యాణ్‌పై విమర్శలు చేశారు. దిశా నిర్దేశం లేని పార్టీలో ఉండడం తనకే ఇష్టం లేదని, రాజీనామా చేసినా గెలిచే శక్తి తనకు ఉందని పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/