మంత్రి వెల్లంపల్లికి రాజకీయ భిక్ష పెట్టిందే పవన్ కళ్యాణ్ కుటుంబం

మంత్రి వెల్లంపల్లికి రాజకీయ భిక్ష పెట్టిందే పవన్ కళ్యాణ్ కుటుంబం

రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేదిక ఫై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారాయి. జనసేన , వైసీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఈ క్రమంలో జనసేన నాయకులు మీడియా సమావేశం ఏర్పటు చేసి వైసీపీ మంత్రుల ఫై మండిపడ్డారు. సినిమాను రాజకీయం చేసిందెవరు? రాజకీయాల్లోకి లాగిందెవరని ప్రశ్నించారు. సినిమాను ప్రభుత్వమే రాజకీయాల్లోకి లాగిందని.. దానిపై మాట్లాడితే, మళ్లీ రాజకీయం ఎందుకని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్‌ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సన్నాసి అంటూ దుర్భాషలాడారని.. కానీ, రాష్ట్రంలో ఇంత మంది సన్నాసులున్నారన్న సంగతి ఇప్పుడే తెలుస్తోందని జనసేన నేతలు అన్నారు.

మంత్రి వెల్లంపల్లికి రాజకీయ భిక్ష పెట్టిందే పవన్ కళ్యాణ్ కుటుంబం అనే విషయం మర్చిపోయారని మండిపడ్డారు. విజయవాడ దుర్గమ్మ గుడి రథంపై ఉన్న సింహం బొమ్మను కొట్టేసిన సన్నాసి మంత్రి వెల్లంపల్లి అని సంచలన కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ఏ మంత్రినీ వ్యక్తిగతంగా దూషించలేదని, విమర్శలు చేయలేదన్నారు. కానీ, ఏపీ మంత్రులంతా కట్టగట్టుకుని పవన్ కళ్యాణ్‌ను దుర్భాషలాడుతున్నారని మండిపడ్డారు.

మా అధినేత శ్రీ @PawanKalyan గారు ప్రస్తావించిన సమస్యలపై స్పందించడం మానేసి, నేను సన్నాసిని అంటే నేను సన్నాసిని అని @YSRCParty నాయకులు, మంత్రులు పోటీపడటం హాస్యాస్పదం – @JanaSenaParty కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ @BandreddiRam గారు. pic.twitter.com/18zlCeb43X— JanaSena Shatagni (@JSPShatagniTeam) September 27, 2021