వైస్సార్సీపీ నేతలందరూ కామాంధులు – పోతిన వెంకట మహేష్‌

,

ప్రస్తుతం ఏపీలో జనసేన – వైస్సార్సీపీ మాటల యుద్ధం కొనసాగుతుంది. తాజాగా పవన్ విశాఖ పర్యటన ను వైస్సార్సీపీ అడ్డుకోవడం , కార్య కర్తలపై కేసులు నమోదు చేయడం , ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు సంఘీభావం తెలుపడం తో ఇంకా కాకా రేపింది. రాబోయే ఎన్నికల్లో జనసేన-వైస్సార్సీపీ కలిసి బరిలోకి దిగబోతాయి అనే సంకేతాలకు బీజం పడినట్లు అయ్యింది. ఇదే క్రమంలో వైస్సార్సీపీ నేతలకు గట్టి కౌంటర్లే ఇవ్వాలని జనసేన అధినేత గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో ఇక తగ్గిదేలే అన్నట్లు జనసేన నేతలు వైస్సార్సీపీ నేతలకు కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్‌ మాట్లాడుతూ..సీఎం జగన్ ఓ భూత వైద్యుడు..వైస్సార్సీపీ నేతలందరూ కామాంధులు అంటూ విరుచుకపడ్డారు.

అర్జంటుగా జగన్ని ఈఎన్టీ స్పెషలిస్టుకి చూపించాలని.. పవన్ వ్యాఖ్యలను వక్రీకరించి జగన్మోహన్ రెడ్డి అసత్యాలు చెప్పారని పేర్కొన్నారు. ఒక‌ భూత వైద్యుడు వేద మంత్రాలు చదివినట్లు జగన్ కామెంట్లు చేశారని.. చెప్పేవి శ్రీరంగ నీతులన్న విధంగా జగన్ వ్యవహార శైలి కనిపిస్తుందని పేర్కొన్నారు. విశాఖపట్నంలో పవన్ను ఎలా ఇబ్బంది పెట్టారో అందరూ చూశారు.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చంద్రబాబు, సోము వీర్రాజు, పవన్ కళ్యాణ్ ని కలిశారన్నారు. జగనుకు భయం పట్టుకుందని ఆయన వ్యాఖ్యలతో అర్ధమైంది… వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ పాత్ర ఉందని అర్దమైందని చురకలు అంటించారు. మీ పార్టీలో కామ సూత్ర కమిటీ సభ్యులు కనిపించ లేదా..? ప్రశ్నించారు.