టిడిపి ఓట్ల‌ను చీల్చిన జనసేన

31 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలపై ప్రభావం

pawan, chandrababu
pawan, chandrababu

అమరావతి: ఏపిలోని సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి విజయంపై జనసేన తీవ్ర ప్రభావం చూపింది. ఆ పార్టీ అభ్యర్ధులు సాధించిన ఓట్లను విశ్లేషిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. రాష్ట్రంలోని 8 లోక్‌సభ, 31 శాసనసభ నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఆయా నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధులు విజయం సాధించారు. వారికి వచ్చిన మెజార్టీ కన్నా కొన్ని చోట్ల జనసేన అభ్యర్ధులకు వచ్చిన ఓట్లు ఎన్నో రెట్లు అధికంగా ఉన్నాయి.
విశాఖపట్నం, కాకినాడ, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, మచిలీపట్నం, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. జనసేన అభ్యర్ధుల్లో అత్యధిక ఓట్లు విశాఖ లోక్‌సభ అభ్యర్థి సిబిఐ పూర్వ జేడి లక్ష్మీనారాయణ సాధించారు. ఆ తర్వాత అమలాపురం అభ్యర్ధి డిఎంఆర్‌ శేఖర్‌, సినీనటుడు నాగబాబులకు వచ్చాయి. అలాగే 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా జనసేన సాధించిన ఓట్లు టిడిపి విజయావకాశాలను దెబ్బతీసింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/