10 వ భారతీయ ఛత్ర సంసాద్ సదస్సులో పవన్‌ కల్యాణ్‌


JanaSena Chief Sri Pawan Kalyan at 10th Bharatiya Chhatra Sansad | Indian Student Parliament

న్యూఢిల్లీ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈరోజు ఉదయం ఢిల్లీ వెళ్లి.. అమర సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలను విరాళంగా అందజేశారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు విజ్ఞాన్ భవన్‌లో జరగనున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కీలకపోన్యాసం చేయడంతోపాటు.. విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. పవన్ గురించి రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ను ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. ఈ సదస్సులో కేంద్ర మంత్రి స్మృతి ఇరాని, కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా కూడా పాల్గొన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/