కాకినాడ చేరుకున్న పవన్‌ కల్యాణ్‌

పవన్ కల్యాణ్ కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు

Pawan Kalyan
Pawan Kalyan

కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు కాకినాడలో పర్యటిస్తున్నారు. వైఎస్‌ఆర్‌సిపి దాడుల్లో గాయపడ్డ జనసేన కార్యకర్తలను ఆయన పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, నగరంలో 144 సెక్షన్ ను విధించారు. మరోవైపు, విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గంలో కాకినాడకు వస్తున్న పవన్ కల్యాణ్ కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారు. జగన్ పర్యటనను అడ్డుకోబోమని, ఆయనను అరెస్ట్ చేయబోమని జిల్లా ఎస్పీ నయీం హస్మీ ప్రకటించినప్పటికీ… పవన్ ను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/