విరాళాల కోసం జ‌న‌సేన పిలుపు

7288040505 మొబైల్ నెంబ‌రును షేర్ చేసిన జ‌న‌సేన‌

JanaSena Party
JanaSena Party

అమరావతిః ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన విరాళాల కోసం పిలుపునిచ్చింది. ఇందుకోసం ఓ ప్ర‌త్యేక నినాదాన్ని కూడా ఆ పార్టీ విడుద‌ల చేసింది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ పోస్ట్‌ను విడుద‌ల చేసింది. ‘నా సేన కోసం… నా వంతు’ పేరిట ఇచ్చిన ఈ పిలుపున‌కు స్పందించే వారు జ‌న‌సేన‌కు రూ.10 మొద‌లుకొని ఎంతైనా విరాళం ఇవ్వ‌వ‌చ్చ‌ని సూచించింది.

ఇప్పుడంతా ఆన్‌లైన్ పేమెంట్ల‌కే మొగ్గు చూపుతున్న వేళ‌… విరాళాల కోసం తెరిచిన ఓ బ్యాంకు ఖాతాకు అనుసంధాన‌మైన ఫోన్ నెంబ‌ర్‌కు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి అన్ని ర‌కాల యూపీఐ యాప్‌ల‌ను అనుసంధానించారు. ఆ నెంబ‌ర్ ఇదేనంటూ 7288040505 మొబైల్ నెంబ‌ర్‌ను జ‌న‌సేన త‌న పోస్ట్‌లో ప్ర‌కటించింది. విరాళాల‌ను సుల‌భంగా అందించేందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్న‌ట్లుగా జన‌సేన తెలిపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/