జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ రాజమండ్రిలో

Jana Sena Party
Jana Sena Party

రాజమండ్రి: రాజమండ్రిలో జనసేన ఆవిర్భవదినోత్సవ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సభ నుండి పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈరోజ సాయంత్రం 4 గంటలకు సభ జరగనుంది. ఇప్పటికే జనసేన నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు రాష్ట్ర నలుమూలల నుంచి జనసేన సైనికులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ తన పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత ఆకుల సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతు రాష్ట్రంలో అతి ముఖ్యమైన సమస్య అవినీతి అని, దానివల్ల రాష్ట్ర అభివృద్ది కుంటుపడుతుందని అన్నారు. విద్య, వైద్యం, యువతకు ఉద్యోగాలు తదితర వాటిని సరిద్దగల ధైర్యం.. చిత్తశుద్దితో ఉన్న వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఆయన అన్నారు. ఆయనను ప్రజలు కూడా నమ్ముతున్నారని ఆకుల అభిప్రాయం వ్యక్తం చేశారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/