ఆర్ఆర్ఆర్ నుండి జననీ సాంగ్ రిలీజ్ : నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు విడుదలైన సాంగ్స్ ఓ లెక్క..ఈ జననీ సాంగ్ ఓ లెక్క అన్నట్లు ఉంది. జననీ ప్రియభారత జననీ ..! పాట ఆద్యంతం ఉద్విగ్నం కలిగించే దృశ్యాలు మతి చెడగొట్టాయి. అల్లూరి సీతారామరాజుగా చరణ్ పాత్ర.. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ పాత్ర స్వరూపాల్ని కూడా ఇందులో ఆవిష్కరించారు. సరోజిని నేనంటే నా పోరాటం.. అందులో నువ్వు సగం! అంటూ అజయ్ దేవగన్ ని విప్లవ యోధుడిగా ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంది.

ఎన్టీఆర్ కంటతడి, హీరోలిద్దరూ రక్తంలో తడిసి ముద్దవ్వడం ఇవన్నీ చూస్తుంటే గుండెలు బరువెక్కిపోతోన్నట్టు ఉంది. తెల్లోళ్ల తుపాకులు భారతీయుల గుండెల్లో పేలుతుంటే .. చిన్నారులు ప్రజలు ఆడాళ్లు నేలకూలుతుంటే ఆ దృశ్యాల్ని ఎంతో భావోద్వేగానికి గురి చేసేవిగా చూపించనున్నారని అర్థమవుతోంది. నిమిషాల నిడివిలోనే ఈ వీడియో ఉత్కంఠ పెంచింది

రాజమౌళి చెప్పినట్టు ఈ పాటలో అంతర్లీనంగా ఉండే ఎమోషన్స్.. సినిమా మొత్తాన్ని చూపిస్తుందని, ఈ పాట కోసం కీరవాణి ఎంతలా కష్టపడ్డాడో అర్థమవుతోంది. కథ ఏంటి? ఏ పాత్ర ఏంటి? అనేది అందరికీ తెలుసు. కానీ సినిమాలో ఎలా ఉంటుంది? ఎలా సాగుతుందనే విషయాలను బయటకు చెప్పకుండా కీరవాణి పాట రాసిన విధానం, పాడిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది.

YouTube video