ఏపిలో ఐదు రోజుల పాటు ‘జన తరంగం’

pawan kalyan
pawan kalyan

హైదరాబాద్‌: బుధవారం నుంచి ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా జనతరంగం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. దేశ, రాష్ట్ర అభివృద్ధితో జనసేనను, యువతను భాగస్వామ్యం చేయడమే జనతరంగం ప్రధాన ఉద్ధేశ్యం. ఈ కార్యక్రమానికి యువత తరలిరావల్సిందిగా ఫేస్‌బుక్‌ వేదికగా పవన్‌ ఆహ్వానించారు. బుధవారం ఉదయం 11 గంటలకు సింగనమల నియోజకవర్గం నుంచి జనసేన జనతరంగం కార్యక్రమం ప్రారంభిస్తుంది. ఈ ఐదు రోజుల పాటు యువత అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు. జనసేన సైనికులు, యువత పార్టీ మేనిఫెస్టో తీసుకుని ప్రతి ఇంటి తలుపు తట్టి జనసేన కార్యక్రమాలను వివరించాలి. కులాలు, మతాలకతీతంగా జనసేన తెస్తున్న సరికొత్త రాజకీయాలను వివరించాలని ఆయన అన్నారు. బంగారు ఆంధ్రప్రదేశ్‌, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే దీనికి వెనుక ముఖ్యోధ్ధేశం అని పవన్‌ ఫేస్‌బుక్‌ ద్వారా పిలుపునిచ్చారు.