వెంగయ్యనాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్న పవన్

కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించనున్న జనసేనాని

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన వెంగయ్యనాయుడు కుటుంబాన్న పరామర్శించనున్నారు. ఈ నెల 23న పరామర్శించనున్నట్టు జనసేన ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు చేసిన అవమానాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్న వెంగయ్యనాయుడు కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్టు తెలిపింది. ఈ నెల 22న తిరుపతి నుంచి బయలుదేరి సాయంత్రం 6 గంటలకు ఒంగోలు చేరుకుంటారని… 23న కుటుంబాన్ని పరామర్శిస్తారని పేర్కొంది. ఈ సందర్భంగా పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్, ఇతర నేతలు పాల్గొంటారని తెలిపింది. జిల్లా ఎస్పీని కలిసి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరే అవకాశం ఉందని చెప్పింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/