పాక్‌పై అగ్రహం వ్యక్తం చేసిన గవర్నర్‌

Jammukashmir Governor SatyaPal Malik fire Pakistan during Republic Day speech
Jammukashmir Governor SatyaPal Malik fire Pakistan during Republic Day speech

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ గణతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుత భారత్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉగ్రవాద కార్యక్రలాపాలకు మద్దతిస్తున్న పాకిస్థాన్‌పై మండిపడ్డారు. పాకిస్థాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. సరిహద్దు గ్రామాల ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోందన్నారు. కాల్పులను నిలువరించేందుకు, ఉగ్రవాదులను అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యానికి, అమరులైన జవాన్లకు సెల్యూట్ చేస్తున్నానని గవర్నర్ సత్యపాల్ మాలిక్ పేర్కొన్నారు.