జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి

Jammu & Kashmir attack
Jammu & Kashmir attack

శ్రీనగర్‌: రోజురోజుకి ఉగ్రమూకల ఆగడాలు పెరిగి పోతున్నాయి. తాజాగా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు. సోపోర్‌లోని బస్టాండ్‌లో సాధారణ పౌరులపై గ్రనేడ్‌లతో విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. కాగా వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కోసం ఉదృతంగా గాలింపు చర్యలు చేపట్టారని సమాచారం.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/