జమ్మూ రహదారిపై ట్రాఫిక్‌ ఆంక్షల ఎత్తివేత

Srinagar-Baramulla highway
Srinagar-Baramulla highway

శ్రీనగర్‌: పుల్వామా ఉగ్ర దాడి అనంతరం శ్రీనగర్‌-బారాముల్లా జాతీయ రహదారిపై పౌరవాహనాల రాకపోకలపై విధించిన ఆంక్షలను జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రప్రభుత్వం ఎత్తివేసింది. శ్రీనగర్‌-బారాముల్లా 44వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం, బుధవారం రెండు రోజుల పాటు పౌరుల వాహనాలు రాకపోకలు సాగించకుండా నిషేధించారు. అనంతరం బుధవారం పౌరుల వాహనాల కాకపోకలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు. ఒక్క ఆదివారం మాత్రమే పౌరుల వాహనాలు జాతీయ రహదారిపై వెళ్లకుండా ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగిస్తున్నారు. శ్రీనగర్‌-ఉధంపూర్‌ మార్గంలోనూ క్రమేణా ట్రాఫిక్‌ ఆంక్షలను తొలగించనున్నారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/